Home » INDIA Alliance
YS Jagan - INDIA Alliance: వైసీపీ అధినేత జగన్.. ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా? త్వరలోనే ఆ కూటమిలో చేరనున్నారా? కాంగ్రెస్ పార్టీపై పీకల్లోతు పగతో రగిలిపోయిన జగన్.. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న టీమ్తో జత కట్టేందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.
మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.
కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం (జులై 22) కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం 86 సీట్లకు, ఎన్డీఏ బలం 101 సీట్లకు తగ్గిపోయింది.
లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని అందుకే లోక్ సభ ఫలితాల్లో బీజేపీ వెనకబడిందని యూపీ(Uttar Pradesh) సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.