Home » Indira Gandhi
రాష్ట్రంలో పేదల కోసం చేపట్టనున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పీఎంఏవైకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపి అధ్యయనం చేయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో ఒక నివేదికను తయారు చేసి, త్వరగా ప్రభుత్వానికి అందజేయాలన్నారు.
ఎమర్జెన్సీ కనిపించిన వాళ్లకి గోద్రా కనిపించలేదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు (Hanumantha Rao) ప్రశ్నించారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని కొనియాడారు.
కేరళ నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎంపికై ఎకాఎకీన మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించారు.
ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ(Rajeev Gandhi) ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.
దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు.
ప్రధాని మోదీ కచ్చతీవులుపై ఎక్స్ వేదికగా చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. తమిళనాడుపై అంతగా ఆందోళన చెందుతుంటే.. శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవులను వెనక్కి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ఆయన ఈ సందర్బంగా సవాల్ విసిరారు.
1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బంగ్లాదేశ్ భూ ఒప్పందాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.