Home » Kanaka durga temple
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు గురువారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు.
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై గురువారం ఉదయం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపట్నుంచి పది రోజులపాటు కనకదుర్గాదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈసారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
Andhrapradesh: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు.
Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు జరుగతుండటం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యద్భుతంగా జరిగిన మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ ‘శ్రీదుర్గా వైభవం’ ఉపన్యాసాలలో, అనంతరం జరిగిన నృత్యవైభవాలలో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేకసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రం’ గ్రంధాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ కనకదుర్గమ్మకు ఆదివారం భక్తిశ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు.
శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.