Home » Karimnagar
రైతు భరోసా, పంటల బీమా పథకాల అమలుకు రూపకల్పన చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు.
‘ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా..? పదేళ్లు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు..? మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా..?’’
‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.11 లక్షల బిల్లులు ఇప్పించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఎదుట ఓ మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించిన కాం ట్రాక్టర్కు చెల్లించాల్సిన డబ్బుకు బదులు ఎరువుల లోడ్లు ఇస్తూ ఒక్కో లోడుకు రూ.లక్ష చొప్పున లంచం డిమాండ్ చేస్తున్న కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్రావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు.
Telangana: పెద్దపల్లి జిల్లా ఓడేడు మండలం మానేరు వంతెన నిర్మాణంలో మరోసారి నాణ్యతా లోపం బయటపడింది. గత తొమ్మిదేళ్లుగా వంతెన పనులు చాలా ఆలస్యంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న (మంగళవారం) భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
Telangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎ్సకు, కాంగ్రె్సకు తేడా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో అమలవుతున్న స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిజానికి, స్మార్ట్ సిటీ మిషన్ గడువు ఆదివారంతోనే ముగిసింది.
New Criminal Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాల వల్ల బాధితులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు వినోద్.