Home » Kavitha Arrest
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.
డిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది.
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు(మంగళవారం) మరోసారి ఈ కేసు విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి.. తన తీర్పులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ ఈడి, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
‘బీజేపీతో జత కట్టనందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పి కుట్రపూరిత కేసులు పెట్టిస్తోంది.. బీజేపీతో బీఆర్‌ఎస్ జోడి కడితే ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్లేదా..?
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియగా.. తీర్పున రిజర్వ్ చేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు మొదలవగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.