Share News

Lakshman: ఇది భారీ కుట్ర.. రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డ లక్ష్మణ్

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:52 PM

MP Lakshman: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన నివేదికపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 శాతం ముస్లిం బీసీలు,36 శాతం హిందూ బీసీలు అని పెట్టారని.. ఇది ఒక భారీ కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటే అని.. ముస్లిం మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.

 Lakshman: ఇది భారీ కుట్ర.. రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డ లక్ష్మణ్
BJP MP Lakshman

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కులగణనపై ప్రవేశపెట్టిన నివేదిక తప్పుల తడకగా ఉందని.. పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే బిల్లు తీసుకొని వచ్చేవారన్నారు. ఓబీసీలపై వలకబోస్తున్న ప్రేమ బయట పడిందని విమర్శించారు. బీసీల లెక్కలను తగ్గించి చూపించారని మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని పెట్టారని తెలిపారు.


వారి మన్నన పొందడానికే...

బీఆర్‌ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలు అని అప్పుడు కేసీఆర్ చెప్పారని.. ఇప్పుడు బీసీలను 42 శాతానికి తగ్గించారన్నారు. లేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతారని.. కనీసం అవగాహన ఉండాలన్నారు. 10 శాతం ముస్లిం బీసీలు, 36 శాతం హిందూ బీసీలు అని పెట్టారని.. ఇది ఒక భారీ కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటే అని.. ముస్లిం మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అంటూ రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని చేర్చారన్నారు. బీఆర్‌ఎస్ అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం కాదని..చదివితే రాజ్యాంగంలో ఏం ఉందో తెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు.

AP High Court: విజయసాయి కుమార్తెకు హైకోర్టు షాక్


నెహ్రూ, ఇందిరా చరిత్ర తెలుసుకో...
కాంగ్రెస్ ముస్లింల ప్రాపకం కోసం బీసీల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ 4 శాతం ముస్లింలకు అప్పనంగా బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ కు బీసీలను మోసం చేయడం కొత్తేమికాదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ.. నెహ్రూ, ఇందిరాగాంధీ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నెహ్రూ లేఖ రాస్తే, రాజీవ్ గాంధీ లోక్‌సభలో దానిపై మాట్లాడారని.. అది చరిత్ర అని చెప్పారు. కామారెడ్డి సభలో ఇచ్చిన డిక్లరేషన్ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేస్తామంటే బీజేపీ సహించదన్నారు. నీట్‌లో మోడీ 20 శాతం రిజర్వేషన్లు కలిపించారని.. మోడీ బీసీలను ఆదుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మరింత పెరిగిన బంగారం ధరలు..

Mastan Sai: వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి ఏం చేశాడంటే.. మస్తాన్‌సాయి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 04:55 PM