Home » Lakshman
బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపా
కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.
దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు.
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తామంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఅర్ఎస్, కాంగ్రెస్‌కు అలవాటు అయ్యాయని ఆరోపించారు.
బీఆర్ఎస్(BRS) కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ(BJP) ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్తో తమ పార్టీకి పొత్తుండదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒక చచ్చిన పాము అని.. బీఆర్ఎస్ ఇక మీదట బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తమ పార్టీకి10 సీట్లు, 35శాతం ఓట్లు వస్తాయన్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ తో పొత్తు ఉందన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు బండారు లక్ష్మణ్ ( Bandaru Lakshman ) అన్నారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో బీజేపీ బీసీ సామజిక చైతన్య సభ నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎంలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బండారు లక్ష్మణ్ మండిపడ్డారు.