MP Lakshman: బీసీల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్
ABN , Publish Date - Apr 11 , 2024 | 04:14 PM
బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపా
హైదరాబాద్: బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని లక్ష్మణ్ తెలిపారు.
KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..
గత పాలకులు విస్మరించిన వర్గాలకు మోదీ సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. అభినవ జ్యోతి బాపూలే నరేంద్ర మోదీ అని కొనియాడారు. విద్యారంగంలోనే కాకుండా ఉపాధి రంగంలో సైతం అణగారిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. విశ్వకర్మ యోజన ద్వారా బలహీన వర్గాలను మోదీ ఆదుకుంటున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 30% బీసీలకు సీట్లు ఇచ్చారని తెలిపారు.
గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బీసీ గణన అంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అడుగడుగునా అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు.
జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని .. ఆ ఎన్నికల్లో 46 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే సీఎం రేవంత్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీల హక్కులను కాలరాస్తున్నారని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం
Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...