Home » Madhya Pradesh
ఈ ఆధునిక యుగంలో రానురాను మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో కేవలం మ్యూజిక్ ఆపాడన్న కోపంతో.. సొంత అన్నయ్యనే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు అని కూడా చూడకుండా.. తనని డ్యాన్స్ చేయనివ్వలేదన్న నెపంతో గొడ్డలితో నరికి చంపేశాడు.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వరుస దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్, కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి.. బీజేపీలోకి (BJP) చేరుతున్నారు. తమ నేతల్ని కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది.
రాష్ట్ర సచివాలయం వల్లభ్‌భవన్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న దాదాపు 20 అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై సీఎం కూడా స్పందించారు.
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శిక్షణా విమానం కుప్పకూలిన ఘటన మధ్యప్రదేశ్ లోని గుణలో బుధవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడింది. నీముచ్ నుంచి ధనకు విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా మంగళవారంనాడు షాజపూర్ సిటీలో రాహుల్‌కు బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. రాహుల్ సైతం హుందాగా వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ కొద్దిసేపు వారితో ముచ్చటించి ఆ తర్వాత ముందుకు కదిలారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు ఫోన్ చూడాలి.. జై శ్రీరాం అనాలి. అలా చేస్తూ ఆకలితో చావండి. ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ సారంగపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు.
భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్‌లో 33 మంది సిట్టింగులకు టికెట్ దక్కలేదు. భోపాల్ సిట్టింగ్ ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు టికెట్ ఇవ్వలేదు. అందుకు గల కారణం 2019లో జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే.. ఆ తర్వాత ప్రగ్యా ఠాకూర్ క్షమాపణ కూడా చెప్పింది. గాంధీపై చేసిన వ్యాఖ్యలతో ప్రధాని మోదీ బాధ పడ్డారు.
ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంతా ప్రవర్తిస్తుంటారు. కొందరు నేరస్థులుగా మారి వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటే .. మరికొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
Madhya Pradesh: ఓవైపు బీజేపీలో(BJP) చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(Kamal Nath) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు కోరుకుంటే తప్పుకుంటా’ అంటూ కార్యకర్తల సమావేశంలో అన్నారు కమల్‌నాథ్. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని తన స్వస్థలమైన చింద్వారాలోని(Chhindwara) హరాయ్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కమల్‌నాథ్ మాట్లాడారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిండోరి బాద్జార్ ఘాట్ వద్ద ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. వారిని షాపుర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.