Home » Maha Shivratri
Andhrapradesh: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది.
Telangana: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.
Andhrapradesh: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో కాశీలోని విశ్వనాథ దేవాలయం, నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయాల్లో భక్తులు ఉత్సాహంగా పూజల్లో పాల్గొనగా..ఆ వీడియో వివరాలను ఇక్కడ చుద్దాం.
Andhrapradesh: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సందేశం వినిపించారు. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగుట్ట(Keesaragutta, Edupayala, Beerangutta) జాతరలకు 340 ప్రత్యేక బస్సులను గ్రేటర్ ఆర్టీసీ నడుపుతోంది.
నంద్యాల: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
నంద్యాల: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
Srisailam Brahmotsavam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం(Srisailam) వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం బిగ్ అలర్ట్ న్యూస్. శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు(Srisailam Temple EO) ప్రకటించారు.
అమెరికాలో హిందు ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో (New Jersey Sai Datta Peetham) ఈ నెల 18, 19 తేదీలలో అంగరంగ వైభవంగా మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదిన వేడుకలు నిర్వహించారు.