Home » Mangalagiri
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు.
మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ.. దండ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: ఆపన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు.
ఈనెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి(TDP AP President)గా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్(Palla Srinivasa Rao Yadav) బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
అమరావతి: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri)లోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి (Deputy CM)గా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు జనసేన కార్యాలయానికి బారులు తీరుతున్నారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే హామీ అమలైంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలపై జీవో విడుదల చేశారు. విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.