Home » Manipur
సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.
మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.
మణిపూర్ లో రెండు నెలల క్రితం చెలరేగిన హింసాకాండ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో 150 నుంచి 200 మంది అల్లరిమూక రెచ్చిపోయి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ చెదురుమదురు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనల్లో ఎవరైనా మృతి చెందారా అనేది వెంటనే తెలియలేదు
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.
రెండు నెలల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు.
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బాధిత ప్రజలను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.
హింసాత్మక పరిస్థితులతో అట్టుడికిపోతున్న మణిపూర్ సందర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అక్కడికి చేరుకున్నారు. 2 రోజులపాటు హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి ఉద్రిక్త పరిస్థితులు అధికంగా ఉన్న చురచంద్‌పుర్‌కి బయలుదేరిన రాహుల్ కాన్వాయ్‌ని రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.