Home » Medigadda Barrage
పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటి విడుదలను పెంచారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజీతో పాటు గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని డ్రోన్ ద్వారా వీడియో చిత్రీకరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు మహదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుకి బిగ్ షాక్ తగిలింది. డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.
కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అనుకోకుండా మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, వాటిని సకాలంలో బాగుచేయించి సాగునీటిని అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో...
మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు, సోషల్ మీడియా చేసిన దుష్ర్పభావాలు పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకునేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ తామిచ్చిన నివేదికను అమలు చేశారా? అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాణహితకు వరద క్రమేణా పెరుగుతుండటంతో పరీక్షలను నిపుణుల కమిటీ నిలిపివేసింది.