Home » Medigadda Barrage
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారని, ఈ మేరకు సీఎం నాలుగైదు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు బుధవారం పరిశీలించారు. ఆ సంస్థలోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు..
ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్‌హౌ్‌సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో కాపాడుకొని, ఈ ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ)తో పరీక్షలు చేయించడంతో పా టు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీరింగ్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్‌సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్ అండ్ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్ ఇంజనీర్ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ సూచించారు.