Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం
ABN , Publish Date - May 29 , 2024 | 07:09 AM
ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది.
ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన మిజోరాం ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేస్తూ పరిహారం ప్రకటించారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధికి ముఖ్యమంత్రి రూ.15 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తుందని సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.
ఐజ్వాల్ జిల్లాలో ఒక రాతి గని కూలిపోవడంతో భారీ కొండచరియలు(landslide) విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మైనర్లతో సహా 27 మంది మరణించారని, మరో ఎనిమిది మంది తప్పిపోయారని మిజోరాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (MSDMA) నివేదిక పేర్కొంది. ఐజ్వాల్ దక్షిణ శివార్లలోని మెల్తామ్, హ్లిమెన్ మధ్య ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించి సంతాపం వ్యక్తం చేశారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరోవైపు మేఘాలయ(meghalaya)లో భారీ వర్షం కారణంగా ఇద్దరు మృతి చెందగా, 500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు జైంతియా హిల్స్‌లో కారు ప్రమాదంలో ఒకరు, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దాదాపు 17 గ్రామాలకు నష్టం వాటిల్లిందని, చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక పేర్కొంది. అసోంలో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. రెమాల్ తుపాను ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా మంగళవారం అసోంలో భారీ నష్టం జరిగింది.
ఇది కూడా చదవండి:
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
Read Latest National News and Telugu News