Share News

Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:16 AM

మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి మరి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం.

Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్
Meghalaya CM Conrad Sangma

మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం ఇటివల కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ లాటరీని(Digital Lottery) ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ. దీనిని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమక్షంలో ప్రకటించారు. ఇందులో మీరు 50 కోట్ల రూపాయల వరకు బహుమతిని గెలుచుకోవచ్చు. ఈ లాటరీని నిర్వహించాలనే నిర్ణయాన్ని అభినందనీయమైన చర్యగా ముఖ్యమంత్రి కాన్రాడ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రారంభించిన ఈ లాటరీలో పాల్గొన్న వారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లాటరీ మొదటి విజేతకు రూ.50 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.


పారదర్శకత

మొదటి విజేతకు 50 కోట్ల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ కొనుగోలు నుంచి బహుమతి పంపిణీ వరకు అత్యంత పారదర్శకత, సమర్ధత పాటిస్తారని సీఎం హామీ ఇచ్చారు. తద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కాన్రాడ్ సంగ్మా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ ప్లాట్‌ఫారమ్ EasyLottery.inని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం చాలా మంది భారతీయులు ఆన్‌లైన్ గేమ్‌లు, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లపై తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని సీఎం ప్రస్తావించారు.


ఆన్‌లైన్ విధానంలో

ఒక వ్యక్తి సరదాతో లాటరీ రాజీపడదని అన్నారు. కేవలం సమాజానికి మేలు చేసేందుకే దీనిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ లాటరీ వల్ల నష్టపోయే ప్రమాదం లేదన్నారు. దీని ద్వారా చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అయితే సాధారణంగా లాటరీని ఏదైనా దుకాణం, మార్కెట్, బస్టాండ్, పోస్టాఫీస్, సర్వీస్ సెంటర్లలో కొనుగోలు చేస్తారు. కానీ మేఘాలయ ప్రభుత్వం దీన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిలో మీరు డిజిటల్ లాటరీ ప్లాట్‌ఫారమ్ EasyLottery.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. ఆ తర్వాత తీసిన డ్రాలో మీరు ఎంపికైతే మీకు ఆ లాటరీ మొత్తాన్ని అందించనున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

GNSS: జాతీయ రహదారిపై నో టోల్ ట్యాక్స్.. ఎన్ని కిలోమీటర్ల వరకంటే


కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్


TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 11 , 2024 | 11:19 AM