Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది..
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నాలుగో రోజు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈసీ) అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. నాగ్‌పాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్ సర్వీసెస్‌లోని మరో 26 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..
Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..