Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ
ABN , Publish Date - Apr 04 , 2024 | 03:50 PM
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో (Delhi Rouse Avenue Court) గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ (ED) దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ
కవిత తరపు న్యాయవాది వాదనలు...
ఈ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్‌ను అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో లేవనెత్తారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలన్నారు. ప్రధాని మోదీ (PM Modi) చాలా సందర్భాలలో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. పరీక్షల సమయంలో పిలల్లకు తల్లి మద్దతు ఉండాలని.. తల్లి అరెస్ట్, పరీక్షల నిర్వహణ పిల్లోడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నారని లాయర్ సంఘ్వీ కోర్టుకు తెలియజేశారు.
Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..
కవితకు మహిళగా, లేజిస్లేచర్‌గా బెయిల్ పొందొచ్చని.. తన కుమారుడికి తల్లి సపోర్ట్ కావాలన్నారు. కవిత కొడుకు భయంలో ఉన్నాడన్నారు. తల్లితో ఉన్న ఆత్మీయత, అనుంబందాన్ని ఎవరూ తీర్చలేరన్నారు. మన కుటుంబాలకు ఓ విధానం ఉందని.. తల్లి పాత్ర చాలా కీలకమని చెప్పుకొచ్చారు. కొడుకు హైదరాబాద్‌లో ఉన్నాడని.. తల్లి జైల్లో ఉందని.. తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉన్నారని కవిత తరపు న్యాయవాది మను సంఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
TS Highcourt: రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం... హైకోర్టు సంచలన తీర్పు
IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...