Home » MLC Kavitha
ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరుఫున ఆమె భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్లో కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు ఆదివారం కలిశారు. కవిత యోగ క్షేమాలు తెలుసుకుని న్యాయపోరాటంపై చేద్దామని కవితకు ధైర్యం చెప్పారు.
ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తయిందని.. తెలంగాణ భవన్ డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. సకల సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మణం ఉంటుందని చెప్పారు.
MLC Kavitha ED Custody: అవును.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కాస్త రిలీఫ్ దక్కింది.! వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..
Kavitha Custody Report: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది.
ED Notices To Kavitha Husband: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.! శుక్రవారం నాడు సోదాలు అని చెప్పి ఈడీ, ఐటీ రంగంలోకి దిగడం.. సడన్గా అరెస్ట్ చేయడం.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ (ED) కస్టడీకి ఇవ్వడం.. ఈ వరుస షాకులతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ..
BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది...