Share News

Delhi High Court: జస్టిస్‌ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:41 AM

జస్టిస్‌ వర్మ స్టోర్‌రూమ్‌ నోట్ల కట్టల వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆయనను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయగా, బార్‌ అసోసియేషన్‌ ఆయన తీర్పుల పునఃసమీక్షతో పాటు అభిశంసన కోరింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ పెరుగుతోంది.

Delhi High Court: జస్టిస్‌ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే

ఈడీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలి

అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం

ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే

ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఆందోళన

నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటన

జస్టిస్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ఆదేశించాలని

సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయవాది వ్యాజ్యం

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు

బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫారసు

ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని

ఉపసంహరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ, మార్చి 24: స్టోర్‌రూమ్‌లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వర్మకు అన్ని వైపుల నుంచీ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన్ను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి అధికారికంగా సిఫారసు చేయగా.. ఢిల్లీ హైకోర్టు ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధులన్నింటినీ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. జస్టిస్‌ వర్మ ఇప్పటిదాకా ఇచ్చిన తీర్పులన్నింటినీ తిరగదోడాలని, ఆయనపై అభిశంసనకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీజేఐను కోరుతూ అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సోమవారం ఒక తీర్మానం చేసింది. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు వెంటనే అనుమతించాలని, అవసరమైతే ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడానికి కూడా అనుమతించాలని అందులో కోరింది. ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, న్యాయవ్యవస్థకు ఉన్న ఏకైక శక్తి ప్రజా విశ్వాసమేనని..

hg.gif

ఒక్కసారి అది పోతే దేశం కుప్పకూలుతుందని ఆందోళన వెలిబుచ్చింది. ఆయన్ను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు బార్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ‘‘ఒక్క న్యాయమూర్తిని కాపాడడానికి మొత్తం ప్రజాస్వామ్యాన్నీ పణంగా పెడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. జస్టిస్‌ వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ మాకు 22 సంస్థలు మద్దతు లేఖలు పంపాయి.

ఈ విషయంలో మేము తుదికంటా పోరాడుతాం. సుప్రీంకోర్టుకు న్యాయాధికారాలు ఉంటే, మాకు ప్రజా మద్దతు ఉంది’’ అని అలహాబాద్‌ హైకోర్ట్‌ బార్‌ అసోసియేన్‌ అధ్యక్షుడు అనిల్‌ తివారీ పేర్కొన్నారు. జస్టిస్‌ వర్మ బదిలీ విషయంలో సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాకే.. తాము విధుల్లోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ సంరక్షణకు తమ ప్రాణాలు త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. జస్టిస్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియర్‌ న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపర ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ఆయన ఈ వ్యవహారానికి సంబంధించి పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. కాలిన నోట్ల కట్టల వీడియో, ఫొటోలతో సహా 25 పేజీల డాక్యుమెంట్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం.. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి కొంతమేరకు తోడ్పడినప్పటికీ, జస్టిస్‌ వర్మపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయలేదని సామాన్యప్రజలు, మీడియా ప్రశ్నిస్తున్నట్టు ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘మార్చి 14నే ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయలేదు? ఎటువంటి అరెస్టులూ ఆరోజే ఎందుకు జరగలేదు? అక్కడ దొరికిన డబ్బును (సగం కాలిన నోట్లను) ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఎటువంటి మహజరూ (జప్తు, సోదాలకు సంబంధించిన నివేదిక) ఎందుకు రూపొందించలేదు? క్రిమినల్‌ లాను ఎందుకు వర్తింపజేయలేదు? అసలు ఈ స్కాండల్‌ గురించి ప్రజలకు తెలియడానికి దాదాపు వారం రోజులు ఎందుకు ఆలస్యమైంది?’’ అని ఆయన తన పిటిషన్‌లో పలు ప్రశ్నలు సంధించారు. జస్టిస్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం ద్వారా క్రిమినల్‌ ప్రొసీజర్‌ను అనుసరించడానికి బదులుగా.. సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీతో అంతర్గత విచారణకు ఆదేశించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిందన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి, అర్ధవంతమైన దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని మాథ్యూస్‌ నెడుంపర తన పిటిషన్‌లో అభ్యర్థించారు. మరోవైపు, జస్టిస్‌ వర్మ వ్యవహారంపై సుప్రీం సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పందించిన తీరును రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కొనియాడారు. ఆయన తనకు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్నీ ప్రజల ముందు పెట్టారని.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక సీజేఐ ఇలా పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించడం ఇదే మొదటిసారని ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 09:08 AM