Home » Nizamabad
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కమిటీలకే పరిమితమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
Telangana: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. నిజామాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది.
Telangana: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్ అని ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే.. వెంకటిని ఐదుగురు విద్యార్థులు కలిసి హతమార్చారు.
నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లల కిడ్నాప్ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పిల్లలను ఎత్తుకెళుతుందని జనం భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌లో ఓ హిజ్రాను అనుమానించి దాడి చేశారు.
Telangana: బీజేపీలో ఘర్ వాపసి నడుస్తోందని.. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
కామారెడ్డి జిల్లా: ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు చేపట్టారు. పేషెంట్‌ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులు, నర్సుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ పరిశీలనకు రాగ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం వివరణ కోరింది.
సహజీవనం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారం మండలంలో జరిగింది. అంతటితో ఆగకుండా మహిళను వివస్త్రగా చేసి కళ్లల్లో కారం కొట్టారు.
Telangana: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు.