Home » Parliament
బుధవారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఐసీపీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో...
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ టీఎంసీ నేత చేసిన మిమిక్రీని వీడియో తీయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. సభ నుంచి 150 మంది ఎంపీలను గొంటేశారని, దానిపై మాత్రం ఎలాంటి చర్చా లేదని అన్నారు. కనీసం ఒక చిన్న వార్తయినా మీరు చూపించండి అంటూ మీడియాను రాహుల్ నిలదీశారు.
రాజకీయ నాయకులు రెచ్చగొట్టే భాష వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. పార్లమెంటు వెలుపల టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ వివాదంపై జగ్దీప్ ధన్‌ఖడ్ రాజ్యసభలో 'కులం' ప్రస్తావన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనపై వ్యక్తిగత దాడి జరిగిందని, ఒక రైతు కులాన్ని అవమాన పరిచారని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొనాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకని ఖర్గే ప్రశ్నించారు.
లోక్ సభలో సరైన ప్రవర్తన లేని కారణంగా మరో ఇద్దరు సభ్యులను స్పీకర్ ఓంబిర్లా(OM Birla) ఇవాళ సస్పెండ్ చేశారు. వారిలో కేరళ(Kerala)కు చెందిన థామస్ చజికదన్, సీపీఎం(CPM)కు చెందిన ఆరిఫ్ లు ఉన్నారు.
రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ను వ్యంగ్యంగా అనుకరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈ ఘటనపై వివాదం రేగడంపై వివరణ ఇచ్చారు. తన చర్య వెనుక ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని అన్నారు. ధన్‌ఖడ్ తనకంటే సీనియర్ అని, లాయర్లుగా తాము ఒకే ప్రొఫెషన్లో కొనసాగామని చెప్పారు.
పార్లమెంటు సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మండిపడ్డారు.
పార్లమెంటు చరిత్రలోనే 144 మంది ఎంపీలపై ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడటంతో విపక్ష ఎంపీలు మంగళవారంనాడు నిరసనకు దిగారు. కొత్త పార్లమెంటు భవనం మకర్ ద్వార్ వెలుపల మెట్లపై 'మాక్ పార్లమెంటు' నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మరో అడుగు ముందుకు వేసి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్పర్సన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ను అనుకరిస్తూ 'పేరడీ' చేశారు. దీనిని రాహుల్ షూట్ చేశారు.
గత వారం లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. గతవారం ఇద్దరు దుండగులు లోక్‌సభ ఛాంబర్లోకి ప్రవేశించి భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఆ భద్రతా వైఫల్యంపై హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
పార్లమెంటు భద్రతా ఉల్లంఘన అంశంపై ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలు నిలిచిపోవడంతో సోమవారంనాడు 78 ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడింది. దీంతో ఇప్పటివరకూ ఉభయసభల్లో సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల సంఖ్య 92కు చేరింది.
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్రమైనదని, దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చినప్పటికీ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణిలో ఆందోళన సాగిస్తుండటంతో తాజాగా 30 మందికి పైగా ఎంపీలు సస్పెండయ్యారు.