Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 12 , 2024 | 03:18 PM
తెలంగాణలో తాము అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే నెలలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికలు ఎవరు ప్రధాని కావాలో నిర్ణయిస్తాయని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో తాము అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే నెలలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎంపీ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణకు వచ్చారని తెలిపారు. సోషల్ మీడియాపై తమ కేడర్‌కు సూచనలు చేశారని వివరించారు.
17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటుతామన్నారు. హైదరాబాద్ ఎంపీ సీటు కూడా బీజేపీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఎవరు ప్రధాని కావాలో నిర్ణయిస్తాయని చెప్పారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో సుస్థిరమైన పాలన అందించారని తెలిపారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. తమ దృష్టిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనని తెలిపారు. బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే దుర్వినియోగం అవుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయంగా మారిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
Amit Shah Live: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ శ్రేణులకు ‘షా’ దిశానిర్దేశం
KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి