Home » Paytm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
పేటీఎం షేర్లు కొనుగోలు చేసిన మదుపర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా ఈ సంస్థ షేర్ ప్రైస్ నేడు(బుధవారం) ఆల్‌టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
పేటీఎం సంక్షోభంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయట.
ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం ఉద్యోగులతో ఆ సంస్థ బాస్ విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు.
Paytm షేర్లు కొనుగోలు చేసిన వారికి షాకింగ్ న్యూస్ తగిలింది. రెండో రోజు కూడా ఈ షేర్లు నష్టాల దిశగా కొనసాగాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే Paytm షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం(Paytm) వినియోగదారులు ఆందోళన చెందారు. చివరికి కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ కస్టమర్లను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు
బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి కొత్త కస్టమర్లను జత చేసుకోవద్దని, వాలెట్లలో డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్స్ వంటివి అనుమతించబడవని పేర్కొంది.
ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు తాజాగా భారీ షాక్ తగిలింది. ఆపరేషన్స్, సేల్స్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను పేటీఎం తాజాగా తొలగించింది.