Share News

Paytm Shares: పుంజుకున్న పేటీఎం షేర్లు... కారణమిదేనా?

ABN , Publish Date - Feb 19 , 2024 | 01:59 PM

గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న Paytm సంస్థకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు సెషన్లలో పేటీఎం షేర్లు పుంజుకుంటున్నాయి.

Paytm Shares: పుంజుకున్న పేటీఎం షేర్లు... కారణమిదేనా?

గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న Paytm సంస్థకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు సెషన్లలో పేటీఎం షేర్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం పేటీఎం షేర్లు ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. Paytm షేర్ల గత ముగింపు ధర రూ.325.25 ఉండగా.. ప్రస్తుతం BSEలో రూ.358.55కు చేరింది. ఈ క్రమంలో 0.5 లక్షల షేర్లు చేతులు మారడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.22,773 కోట్లకు పెరిగింది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై విధించిన పరిమితుల కారణంగా కొనసాగుతున్న సంక్షోభం మధ్య Paytm వ్యాపారి చెల్లింపులను సెటిల్ చేయడానికి Axis బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ షేర్లు పుంజుకోవడం విశేషం. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తమ నోడల్‌ ఖాతాను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నుంచి యాక్సిస్‌ బ్యాంకుకు మార్చింది. దీంతో పేటీఎం క్యూఆర్‌, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషీన్‌ సేవలు మార్చి 15 తరవాతా వ్యాపారులకు యథావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్‌ ఖాతా అంటే, సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్‌ చేస్తారు.

గతంలో Paytm వినియోగదారులకు పాక్షిక ఉపశమనంగా RBI PPBL డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలపై పరిమితుల గడువును ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు 15 రోజుల పాటు పొడిగించింది. గత 13 సెషన్‌లలో జనవరి 31, 2023 ముగింపు సమయానికి Paytm షేర్ దాదాపు 53% క్షీణించింది. జనవరి 31, 2023 నాటికి కొత్త కస్టమర్‌లను తీసుకోకుండా PPBLని తక్షణమే తీసుకోకుండా RBI నిలిపివేసింది. అదే సమయంలో కంపెనీ తదుపరి డిపాజిట్లు లేదా క్రెడిట్‌లను తీసుకోకుండా నిరోధించింది.

Updated Date - Feb 19 , 2024 | 02:10 PM