Home » Peddapalli
గోదావరి ఖనికి చెందిన న్యాయవాది కిరణ్జీపై వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో మూడు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనం తరం అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు.
లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు అలంకార ప్రాయంగా మారాయి. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం లేక అలంకారప్రాయంగా మిగిలాయి.ఊరికి దూరంగా నిర్మించడంతో కొన్ని రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.
గోదావరినదిలో నీరు లేక మహా శివరాత్రి పుణ్య స్నానాలకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చొరవతో ప్రభుత్వం ఎల్లంపల్లి నీటిని దిగువ గోదావరిలోకి వదిలింది. గోదావరినదిలో నీరు లేని పరిస్థితిపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జిల్లా సైన్స్ అధికారి, కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి. రవినందన్ రావు ఎంపికైనట్లు డీఈవో మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎస్సీఈఆర్టీలో నిర్వహించే వైజ్ఞానిక సదస్సుకు హాజరుకావాలని డీఎస్వోకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా గోదావరినదిలో పుణ్య స్నానాలు చేయటానికి వచ్చిన భక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. బుధ వారం గోదావరినది తీరాన్ని పుట్ట మధు పరిశీ లించి భక్తులతో మాట్లా డారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తర లించేందుకే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు ఆపడం లేదన్నారు.
సింగరేణి ఆర్జీ-1 యాజ మాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధులతో బుధవారం ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్ అధ్యక్షతన ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమా వేశం నిర్వహించారు. గుర్తింపు సంఘం ప్రతినిధులు వివిధ సమస్యపై చర్చించారు.
Shivalingas: మహాశివరాత్రి పర్వదినాన ఓ సూక్ష్మ కళాకారుడు తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నాడు. దాదాపు 109 శివలింగాలను చాక్‌పీసులతో తయారు చేశాడు. ఈ శివలింగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రభుత్వాసు పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం అడ్డగుంటపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీలకు ప్రస వాలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేస్తూ వివరాలు నమోదు చేయాలని, ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణీల తో మాట్లాడి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడా లని వైద్య సిబ్బందికి సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దప ల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎమ్మె ల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సం బంధించి 36 లొకేషన్లలో 108 పోలింగ్స్టేషన్లు ఉన్నాయన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎల్ఆర్ఎస్, ట్రేడ్ లైసెన్స్, రెవెన్యూ మేళాలో పలు సమస్యలు పరిష్కారమయ్యా యి. ఈనెల 10 నుంచి మంగళవారం వరకు మున్సిపల్ కార్యాలయంలో మేళాలు నిర్వహించారు. ఇందులో డ్యాక్యూమెంట్లలో వివిధ రకాల తప్పులు, ప్రభుత్వ భూముల సర్వే నంబర్లలో ఉన్న ప్రైవేట్ భూములను సర్వే చేయించారు.