Employees: పెండింగ్ బిల్లుల చెల్లింపు ఎప్పుడో?
ABN , Publish Date - Nov 09 , 2024 | 04:44 AM
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బకాయిలు రెండేళ్లుగా చెల్లించడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్, లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల పారితోషకం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్స్ బిల్లులు చెల్లించడంలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అన్ని శాఖలకు సంబంధించి 4వేల కోట్ల బకాయిలు
గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివా్‌సరావు
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బకాయిలు రెండేళ్లుగా చెల్లించడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్, లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల పారితోషకం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్స్ బిల్లులు చెల్లించడంలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించి సుమారు రూ.4 వేల కోట్ల వరకు ఇలాంటి బకాయిలున్నాయని, వీటికి సంబంధించి పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు తెలిపారు. బిల్లులు అన్ని ఎస్‌టీవో కార్యాలయాల్లో సమర్పించి నెలలు గడిచినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.
రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. నెలలుగా బిల్లులు మంజూరు కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశాల్లో 50ు బకాయిల చెల్లింపు, ఉద్యోగుల ఎన్నికల బదిలీలను అక్టోబరులోగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడలేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీపావళిలోపు బిల్లులు అన్ని క్లియర్ చేస్తారని ఉద్యోగులు ఆశించినా నిరాశే మిగిలిందంటున్నారు. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘం నేతలు కోరుతున్నారు.