Home » Phone tapping
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీకి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు అక్రమ ఆస్థులపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Telangana: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతూన్నారో రికార్డ్ చేసిందని ఆరోపించారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు.
Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వార్తలపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ పై కోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా’’ అని తెలిపారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నేటితో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఈరోజు (మంగళవారం) ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను కాసేపట్లో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
సాయంత్రం భుజంగ రావు, తిరుపతన్నను పోలీసులు కోర్టులో హాజరు పరుచనున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబీ అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదటి సారి రిటైర్డ్ ఐజి పేరును రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం
ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు పడింది.
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం, భూ కబ్జా, మని ల్యాండరింగ్ స్కాంలకి పాల్పడిందని.. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్దిచెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ (Congres) కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తిరుపతన్న, భుజంగ రావును అధికారులు రెండో రోజు కస్టడీ విచారణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో న్యాయవాది సమక్షంలో ఇద్దరిని రెండవ రోజు దర్యాప్తు బృందం విచారించనుంది.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.