Share News

TG Politics: అందుకే ఫోన్ ట్యాపింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:34 PM

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

TG Politics: అందుకే ఫోన్ ట్యాపింగ్..  సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.


Venkatram Reddy: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఉన్నట్టు కథలు అల్లారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం చేయరాని తప్పుడు పనులన్నీ చేసిందని మండిపడ్డారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని సీఎం రేవంత్‌రెడ్డి అనలేదని.. సిరిసిల్లాలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుమానాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు.


లై డిటేక్టర్ టెస్ట్‌కి రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ అనడం తప్పని చెప్పారు. విచిత్రమైన, నీచమైన సంస్కృతిని తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్టాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రి మీద అవాకులు, చెవాకులు పేలడం కేటీఆర్‌, బీఆర్ఎస్ నేతలకు సరికాదన్నారు. కేటీఆర్ చెల్లి కవిత తీహార్ జైల్లో ఉందని.. ఇంకో వైపు ఫోన్ ట్యాపింగ్‌లు రోజుకోక మలుపు తిరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్‌కి తెల్వకుండా ఇవ్వన్నీ జరిగే అవకాశం ఉండదన్నారు.


తెలంగాణ రాకముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని.. ఇప్పుడెన్ని ఉన్నాయని ప్రశ్నించారు. ఆస్తులు ఎలా సంపాదించారో దానిపై లై డిటేక్టర్ టెస్ట్‌కి కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజాయతీ గల పోలీసులను రేవంత్ ప్రభుత్వం నియమించిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగాయో త్వరలో బయటపెడతామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...


వంశీ చందర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి: సంపత్ కుమార్

కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లామని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ (Sampath Kumar) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయి ఇన్‌చార్జిలు ఎంపీ ఎన్నికల కోసం కష్టపడాలని సూచించారు.


‘పంచ్ న్యాయ్, పచ్చిస్ గ్యారంటీలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి.. ఈ విజయాన్ని రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇస్తామని సంపత్ కుమార్ తెలిపారు.


కేటీఆర్‌కి పిచ్చి ముదిరింది: ఆది శ్రీనివాస్

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ సవాల్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (AADI SRINIVAS) స్పందించారు. కేటీఆర్ నిజంగానే లై డిటెక్టర్ టెస్ట్‌కి సిద్ధంగా ఉంటే తాము ఏర్పాట్లు చేస్తామని సవాల్ విసిరారు. శనివారం నాడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ టైం, ప్లేస్ చెబితే టెస్ట్‌కి తాము ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్‌ విసిరారని.. ఆయన సవాల్‌ని రేవంత్ స్వీకరించి గన్‌పార్క్‌కి వస్తే పత్తా లేకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు.


కేటీఆర్‌కి పిచ్చి ముదిరి పీక్ స్టేజ్ కెళ్లిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో నిజాలు బయటపడుతుంటే కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. భార్య భర్తలు, జడ్జీల ఫోన్లు కూడా కేటీఆర్ విన్నారన్నారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని రేవంత్‌కి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే చెప్పానని గుర్తుచేశారు.


తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసేంతా పరిస్థితి ఏముంది? అని ప్రశ్నించారు. రేవంత్ పోరాటయోధుడని కొనియాడారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని కేటీఆర్ ఇంకోసారి మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ వెంపర్లాడింది నిజం కాదా? అని ఆది శ్రీనివాస్ నిలదీశారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‏కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 05:37 PM