Share News

Big Breaking: నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ట్రయల్స్..

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:30 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సంస్థే నారా లోకేష్‌కి తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ అలెర్ట్‌ను ఆపిల్ సంస్థ ఆయన ఫోన్‌కి పంపించింది.

Big Breaking: నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ట్రయల్స్..
Nara Lokesh

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సంస్థే నారా లోకేష్‌కి తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ అలెర్ట్‌ను ఆపిల్ సంస్థ ఆయన ఫోన్‌కి పంపించింది. నారా లోకేష్ ఫోన్‌కి ట్యాపింగ్, హ్యాకింగ్ అలెర్ట్ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. గుర్తు తెలియని సాఫ్ట్‌వేర్‌లతో మీ ఫోన్‌ను హ్యాకింగ్, ట్యాపింగ్ చెయ్యడానికి ప్రయత్నం జరుగుతోందంటూ నారా లోకేష్ ఫోన్‌కి ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపించింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాంకింగ్‌కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

AP Elections: ఎంపీగా పోటీ చేయడానికి కారణం అదే.. మరో బాంబు పేల్చిన షర్మిల..


నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కి పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆపిల్ అలెర్ట్ నోటిఫికేషన్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేయనుంది. తమ ఫోన్లు జగన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాడతామని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రజల నమ్మకం కోల్పోవడం తో.. ఏపీ సీఎం జగన్ ఫోన్ ట్యాపింగ్‌పై నమ్మకం పెట్టుకున్నాడంటూ టీడీపీ నేతల విమర్శిస్తున్నారు.

AP Election 2024: ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ.. ప్రచారం కోసం భారీ ప్లాన్

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 12 , 2024 | 01:40 PM