Home » Politicians
సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్‌లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, శంబల్పూర్, కోంఝార్ నియోజకవర్గాలు ఉన్నాయి.
పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ అపరాధి అని శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ప్రకటించారు.
చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీసీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియ్‌సగా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. గురువారం మీడియాతో దీనిపై ఆయన మాట్లాడారు.
చిన్నప్పటి నుంచీ అంతా ఒక్కచోట పెరిగారు. సరదాలు, సంబరాల్లో పాలుపంచుకున్నారు. కలసి పండగలు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిదీ ఒకే మాట. చిన్నా పెద్దా అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని ఛిన్నభిన్నం చేసింది.
పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం గురువారం ‘చలో మాచర్ల’కు పిలుపిచ్చింది.
‘‘పురీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడు’’ అంటూ నోరుజారిన బీజేపీ నేత, పురీ నుంచి ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన సంబిత్ పాత్రా చిక్కుల్లో పడ్డారు.
హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా నిత్యం వ్యాఖ్యలు చేస్తూ, సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ప్రజా జీవితం నుంచి వైదొలగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్ నటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.