-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh telangana national and international latest news Myanmar Bangkok Earthquake Updates IPL Today Match GT vs MI andhra jyothy news on 29th march 2025 Amar
-

Breaking News: కొలికపూడికి షాక్..
ABN , First Publish Date - Mar 29 , 2025 | 10:53 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-29T16:54:46+05:30
కొలికపూడికి షాక్..
అమరావతి: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు తిరువూరు పంచాయతీ
రమేష్‌రెడ్డికి అనుకూలంగా టీడీపీ ఆఫీస్‌కు తిరువూరు కార్యకర్తలు
MLA కొలికపూడికి వ్యతిరేకంగా ఏకమైన తిరువూరు టీడీపీ నేతలు
తిరువూరుకు కొలికపూడి వద్దంటూ టీడీపీ శ్రేణుల నినాదాలు
కార్యకర్తలను సముదాయించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా
ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించిన పల్లా శ్రీనివాసరావు
కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తా.
రమేష్‌రెడ్డిపై మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
కుటుంబంలో చిన్నచిన్న కలహాల్లాంటిదే తిరువూరు వ్యవహారం.
త్వరలోనే తిరువూరు వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెడతాం.
-
2025-03-29T13:15:08+05:30
ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మ శ్రీ దందాలపై చర్యలు తీసుకుంటాం
మైనింగ్, ఇసుక రవాణాతో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం
అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు
ఈనెల 31న అనకాపల్లి- అచ్చుతాపురం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన
నియోజకవర్గంలోని ముఖ్య ప్రదేశాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
-
2025-03-29T12:54:22+05:30
యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శంకర్ అరెస్ట్
న్యూస్‌లైన్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శంకర్‌పై కేసు
అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో శంకర్‌పై అత్యాచారం కేసు
శంకర్ తనను పెళ్లి పేరుతో మోసం చేశాడనీ, అత్యాచారం చేశాడని ఓ మహిళ పిర్యాదు
పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను బెదిరిస్తున్నాడంటూ కంప్లైంట్
69,79, 352, 351 (4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు
-
2025-03-29T11:51:15+05:30
60 వేల మంది టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
కార్యకర్తలు, నేతలకు పార్టీ 43వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజానికానికి, అభిమానులకు ధన్యవాదాలు
వివిధ వర్గాల ప్రజలు రకరకాల పండుగలు జరుపుకుంటారు
అన్నివర్గాల వారు జరుపుకునే పండుగ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది
నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నాం
పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా మందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించింది.
ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాను.
టీడీపీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అన్న విధంగా తెలుగుజాతిని చూడాలి
సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలిచాం
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు రూ.2కే కిలో బియ్యం, పెన్షన్, జనాతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు
దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆరే
తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ
43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం
పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం
త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు
ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ శ్రేణులు నిలబడ్డారు.
ఈ సారి మహానాడును కడపలో నిర్వహించబోతున్నాం
పేదలకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అంటుండేవారు
ఆ ఆశయ సాధనలో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం
కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాకంక్షలు తెలపడమే కాదు.. వారికి జన్మంతా రుణపడి ఉంటాను
పార్టీ కుటుంబ పెద్దగా అండగా ఉంటా, కార్యకర్తలే టీడీపీకి శ్రీరామరక్ష
తెలుగుదేశం బలోపేతమంటే రాష్ట్రానికి మంచి జరగడమే
-
2025-03-29T11:24:25+05:30
బెల్లం విక్రయాలు నిలిపివేత ఎందుకంటే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో బెల్లం విక్రయాల నిలిపివేత
బెల్లం విక్రయించవద్దని వ్యాపారులకు ఎక్సైజ్ అధికారుల ఆదేశం
హుజురాబాద్ నుంచి హన్మకొండ, ములుగు, మేడారానికి బ్లాక్‌లో బెల్లం తరలిస్తున్నారన్న ఆరోపణలు
ఆ ప్రాంతాల్లో గుడుంబా తయారికి వాడుతున్నారని బెల్లం విక్రయాల నిలిపివేత
ఉగాది నేపథ్యంలో బెల్లం అమ్మకపోతే భారీగా నష్టపోతామని వ్యాపారుల ఆవేదన
-
2025-03-29T10:56:40+05:30
పోలీస్ కస్టడీకి వంశీ
పోలీస్ కస్టడీ కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలు నుంచి తరలించిన పోలీసులు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం పోలీస్ కస్టడీకి తీసుకున్న పోలీసులు
ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో
ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో వంశీపై కేసు
ఈకేసు విచారణ కోసం వంశీని ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు
ఇరువర్గాల వాదనల అనంతరం ఒక రోజు కస్టడీకి అనుమతి