Share News

High Court: 21వ తేదీలోగా పార్టీ జెండాలు తొలగించకపోతే కేసులు

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:50 AM

అన్ని రాజకీయపార్టీకు రాష్ట్ర హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 21వ తేదీలోగా పార్టీ జెండాలు తొలగించకపోతే కేసులు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పార్టీ జెండాలు, దిమ్మెలు తప్పకుండా తొలగించాల్సిందేనని హెచ్చరించింది.

High Court: 21వ తేదీలోగా పార్టీ జెండాలు తొలగించకపోతే కేసులు

- హెచ్చరించిన హైకోర్టు

చెన్నై: బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పార్టీల జెండాలు, స్తంభాలను ఏప్రిల్‌ 21వ తేదీలోగా తొలగించని పక్షంలో కేసులు నమోదుచేయాలని మద్రాసు హైకోర్టు(Madras High Court) ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రాంతాలు ఆక్రమించి ఏర్పాటుచేసిన అన్ని రాజకీయ పార్టీలు, కుల-మత పరమైన జెండాలను 12 వారాల్లో తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం గత జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: EPS: తేల్చిచెప్పేశారు.. ఆ మాజీసీఎంను పార్టీలో చేర్చుకునేది లేదు


హైకోర్టు ఉత్తర్వులతో, జాతీయ, రాష్ట్ర, స్థానిక సంస్థలకు సొంతమైన రోడ్ల పక్కనే ఉన్న పార్టీ జెండాలు తొలగించాలని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌(Duraimurugan) పార్టీ నేతలు, కార్యకర్తలకు లేఖ రాశారు. ఈ క్రమంలో, చెన్నై(Chennai)కి చెందిన న్యాయవాది రమేష్‌... రాయపురం ఫుట్‌పాత్‌పై ఏర్పాటుచేసిన పార్టీ జెండా స్తంభం, శిలాఫలాకం తొలగించేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు... బహిరంగ ప్రాంతాలు, రోడ్లపై ఉన్న పార్టీ జెండాలను, స్తంభాలను ఏప్రిల్‌ 21వ తేదిలోపు తొలగించని పక్షంలో, కేసు నమోదుచేయవచ్చని ఉత్తర్వులు తేల్చి చెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

పాస్టర్‌ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు

మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు

గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2025 | 07:43 AM

Updated Date - Mar 28 , 2025 | 10:50 AM