Share News

HCU Row: భూ వివాదంపై భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 06:41 PM

రేవంత్ సర్కారుకు తలనొప్పిలా మారిన కంచ గచ్చిబౌలి భూ వివాదం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రతినిధి బృందం తెలంగాణ మంత్రుల కమిటీతో భేటీ అయింది. ఈ సమావేశంలో..

HCU Row: భూ వివాదంపై భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు
HCU Meeting

Hyderabad Central University: కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన హైదరాబాద్ కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూ వివాదంపై తెలంగాణ సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. మంత్రుల కమిటీతో UoH(యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్) ఉపాధ్యాయ సంఘం, పౌర సమాజ ప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రుల కమిటీలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, మీనాక్షి నటరాజన్ , వంశీ చంద్ రెడ్డి ఉన్నారు. క్యాంపస్‌లో పోలీసుల ఉపసంహరణ, నిషేధాజ్ఞల తొలగింపు చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధుల సంఘం డిమాండ్ చేశారు. నిరసనలకు సంబంధించి పెట్టిన కేసులు ఉపసంహరించాలని, కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి. 400 ఎకరాల్లో నష్టం అంచనా, జీవవైవిధ్య సర్వేకు అనుమతి కోరుతూ విజ్ఞప్తి చేశారు.

అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భూమిలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రతినిధులకు మంత్రుల బృందం తెలిపింది. క్యాంపస్ నుంచి పోలీస్‌లను వెనక్కు తీసుకునే ప్రక్రియపై యూనివర్సిటీతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. విద్యార్థుల కేసుల విషయం సానుభూతితో సమీక్షిస్తామని మంత్రులు బృందం హామీ ఇచ్చారు. అయితే, కోర్టు ఆదేశాల కారణంగా సర్వేకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే క్యాంపస్ సందర్శనకు సిద్ధమని మంత్రుల కమిటీ ప్రతినిధుల బృందానికి తెలియచేసింది.

ఇలా ఉండగా, మీటింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సియు(HCU) విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరణ చేయండిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

సచివాలయంలో సమావేశం అనంతరం ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, దీంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసుల వాపసుకు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి పోలీసులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయాలని న్యాయశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇలా ఉండగా, తమ డిమాండ్లు నెరవేర్చలేదన్న కారణంతో విద్యార్థుల JAC భేటీకి దూరంగా ఉంది.


ఇవి కూడా చదవండి

Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ

YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 06:41 PM