Home » Ponguleti Srinivasa Reddy
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని.. ఆ పరిస్థితుల్లో నీటిని మొత్తం వేస్ట్‌గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు.
తాము ఇంకా గేట్లు తెరవలేదని.. తెరిస్తే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ (Congress) లోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని.. స్వచ్ఛందంగా నేతలే తమ పార్టీలో చేరుతామని వస్తున్నారని వివరించారు. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
విధ్వంసకర పాలన నుంచి ప్రజా పాలనలోకి వచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతూ లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.
Telangana: మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచిలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేసవికాలంలోనే శంకుస్థాపన చేసిన రోడ్లు పూర్తి చేయాలన్నారు. అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.
రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ప్రజలు కంగారు పడవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో రూ. 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్ రూం ప్లాట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ప్రారంభించారు.
వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని విమర్శించారు.
ఎంపీ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి, సూర్పనకకు పోటీ జరగబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మరిపెడలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఖమ్మం, మహబూబ్‌బాద్ పార్లమెంట్ నియోజక వర్గ నేతలతో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు(సోమవారం) సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఈ రెండు జిల్లాలోని కీలక నేతలంతా హాజరయ్యారు. కానీ కేసీఆర్ నిర్వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatarao) మాత్రం డుమ్మా కొట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే రాకపోవడం చర్చనీయాంశం అయింది.