Home » Ponguleti Srinivasa Reddy
Telangana: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) హెచ్చరించారు. శనివారం నాడు వరంగల్‌లో పర్యటించారు.
ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంతో పేదలకు మంచి జరుగుతుందన్నారు.
అభయహస్తం దరఖాస్తులు ఎంట్రీ తర్వాత ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సచివాలయంలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ..... ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు మీ సేవకులుగా పనిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
Telangana: డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉవ్వెత్తున నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ యార్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవాడిని అన్ని రంగాల్లో అదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకైక ఎజెండా అని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకునేదే ప్రభుత్వం చేస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. మధ్యాహ్నానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యారేజీ వద్దకు...
పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘గత ప్రభుత్వంలో ప్రజలకు, అధికారులకు, మంత్రులకూ స్వేచ్ఛ లేదు.మంత్రులు ఏదీ చేయాలన్నా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆదేశాలు రావాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) సింగరేణి గనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) స్పష్టం చేశారు. సోమవారం నాడు మణుగూరు సింగరేణి ఓసి 2 వద్ద ఏర్పాటు చేసిన ఫిట్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ... సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ( INTUC ) గడియారం గుర్తుపై ఓటే వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ సోదరులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన పిట్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.