Minister Ponguleti: గంజాయి అరికట్టాలని మంత్రి పొంగులేటిని కోరిన మహిళా కూలీలు..
ABN , Publish Date - Jul 14 , 2024 | 06:43 PM
రూరల్ మండలం తనగంపాడు(Thanagampadu) పత్తి చేలల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా రైతు కూలీలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు.

ఖమ్మం: రూరల్ మండలం తనగంపాడు(Thanagampadu) పత్తి చేలల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా రైతు కూలీలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గంజాయి ఎక్కువగా ఉందని, దాన్ని అరికట్టాలని పొంగులేటిని మహిళలు కోరారు. తమ పిల్లలు, యువత మత్తుపదార్థాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయణ్ని వేడుకున్నారు. దీంతో గంజాయి నిర్మూలనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏసీబీ తిరుపతిరెడ్డిని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని పొంగులేటి వారికి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాసరెడ్డి వచ్చి తమను పలకరించడంతో మహిళా కూలీలంతా సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
MLA Shankar: పార్టీ ఫిరాయింపుపై రాహుల్ గాంధీనే చెప్పారు కదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
Raghunandan Rao: ఎమ్మెల్యేలను చేర్చుకునే శ్రద్ధ నిరుద్యోగులపై పెట్టాలి: ఎంపీ రఘునందన్ రావు..