Home » Priyanka Gandhi
త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ తంపితో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా(PriyankaGandhi Vadra) పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ఇవాళ తొలిసారి ప్రస్తావించింది.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
Telangana Elections: తెలంగాణలో పోలింగ్ ఊపందుకుంది. ఉదయం నుంచే రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
Telangana Elections: జిల్లాలోని జహీరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో అగ్రనేత ప్రియాంక గాంధీ, పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాటపై ప్రియాంక గాంధీ స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. దొరల తెలంగాణ కావాలో... ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక అన్నారు. దేశంలో ఫామ్ హౌస్‌లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదు. తెలంగాణలోని పెద్ద నేతలు ఫామ్ హౌస్‌లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు.
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.