Home » Priyanka Gandhi
కొండచరియలు విరిగిపడటంతో కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగస్టు 1న వయనాడ్‌లో పర్యటించారు.
ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదంలో దాదాపు 160 మందికిపైగా మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్, ముప్పడిలో పర్యటించనున్నారు.
కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో హోటల్ యజమానులు, సిబ్బంది పేర్లు తప్పక ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
మణిపూర్‌లోని జిరిబమ్‌లో భద్రత దళాల కాన్వాయిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్ణణకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్జప్తి చేశారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని అన్నారు.
టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రియాంకా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.