Mallikarjun Kharge: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్
ABN , Publish Date - Oct 25 , 2024 | 07:27 PM
వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కలపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయం వెలుపల ఉన్నారు. దీంతో ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ వేసే వేళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోసిపుచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారని ఆయన వివరణ ఇచ్చారు. ఖర్గేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తుందంటూ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు.
Also Read: Telangana Politics: మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం: జగ్గారెడ్డి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై సైతం ఈ అంశంపై స్పందించారు. ఈ తరహా ఘటనలు గతంలో బహిరంగంగా చాలా చూశామన్నారు. కర్ణాటకలోనే మల్లిఖార్జున్ ఖర్గే పెద్ద నాయకుడని ఆయన అభివర్ణించారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఆయనను బీజేపీ గౌరవిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తమ నాయకుడేనని బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఇక అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ సైతం ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను అవమానించిందన్నారు. దళితులను ఆ పార్టీ మూడో తరగత పౌరులుగా పరిగణిస్తుందని విమర్శించారు.
Also Read: Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట
Also Read: సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
అక్టోబర్ 23వ తేదీ అంటే.. బుధవారం కలపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాహుల్, సోనియాలతో కలసి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో మల్లికార్జున్ ఖర్గే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వెలుపల ఉన్నారు. దీంతో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేసే వేళ.. ఆర్ఓ కార్యాలయం బయట పార్టీ అధినేత ఖర్గేను ఉంచి ఆ పార్టీ పెద్దలు ఘోరంగా అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు సంధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైవిధంగా స్పందించి.. వివరణ ఇచ్చింది.
Also Read: Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..
Also Read: Cyclone Dana: తీరం దాటిన దానా.. పోర్టుల వద్ద హెచ్చరికలు తొలగింపు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలీ రెండు స్థానాల నుంచి విజయం సాధించారు. అనంతరం ఆయన వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగాలని నిర్ణయించారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీతో కలిసి రోడ్ షో నిర్వహించి.. అనంతరం ఆర్వో కార్యాలయంలో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో మల్లికార్జున్ ఖర్గేతోపాటు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆర్వో కార్యాలయం వెలుపల ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
For National News And Telugu News.