Share News

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:52 PM

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ స్థానిక నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలపై ప్రియాంకగాంధీ సంతకాలు చేశారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక.. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ ప్రజలు తన కుటుంబ..

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..
Priyanka Gandhi

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆమె నామినేషన్ వేయడానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ స్థానిక నేతల సమక్షంలో నామినేషన్ పత్రాలపై ప్రియాంకగాంధీ సంతకాలు చేశారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక.. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యలని, వారికోసం నిలబడేందుకు ఇక్కడికి వచ్చినట్లు ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రియాంక తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను అనధికారికంగా వయనాడ్ ఎంపీనే అన్నారు. తన సోదరి ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించినప్పుడు.. ప్రియాంక గాంధీని వయనాడ్ నుంచి పోటీకి దింపాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల నుంచి వినిపించిందన్నారు. ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను అభ్యర్థిగా ఖరారు చేసిందని తెలిపారు. బహిరంగ సభ తర్వాత ప్రియాంక గాంధీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..


ముందుగా భారీ ర్యాలీ..

నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వయనాడ్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా కనిపించారు. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అలాగే రాహుల్, ప్రియాంక తన ర్యాలీ దృశ్యాలను స్వయంగా ఫోన్‌లో చిత్రీకరించారు.

Chandrababu : ఏపీని ఆపలేరు!


మొదటిసారి..

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రమే నిర్వహించారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలీ స్థానాల నుంచి పోటీచేయగా.. రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్13న ఇక్కడ పోలింగ్ జరగనుంది.

నేవీ చేతికి మరో అణ్వాస్త్రం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 01:52 PM