AP High Court: ఏపీ హైకోర్టులో తులసిబాబుకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:09 AM
AP High Court: కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై కస్టోడియల్ టార్చర్ కేసులో బెయిల్ కోసం తులసిబాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.

అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై (AP Deputy Speaker Raghurama Krishnam Raju) థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టులో (AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. తులిసిబాబు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ కేసులో కీలక నిందితులు అరెస్ట్ కావాల్సి ఉండటంతో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఇరవై రోజుల క్రితం తులసిబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టులో కాకుండా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తులసిబాబు.
ఈరోజు ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది. మరికొంతమంది కీలక నిందితులు కూడా అరెస్ట్ కావాల్సి ఉంది. ఇందులో అప్పటి ఇంటలిజెన్స్ బాస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులుతో పాటు అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన విజయ్ పాల్‌కు మాత్రం జిల్లా కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అంతుకు ముందు విజయ్ పాల్‌కు కూడా జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆయన మరలా జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. దాదాపు రెండు నెలల తర్వాత విజయ్ పాల్‌కు బెయిల్ మంజూరు అయ్యింది.
GBS Virus: జీబీఎస్ వైరస్‌పై జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏమన్నారంటే..
ప్రస్తుతం కీలక నిందితుడిగా ఉన్న తులసిబాబును కూడా ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు ఎస్పీ ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆయన ఎటువంటి సహకారం అందించలేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తులసిబాబును ఒంగోలు ఎస్పీ విచారించారు. అయినప్పటికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. నాలుగు రోజుల క్రితమే తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై వాదప్రతివాదనలు ముగియగా.. ఈరోజు తులసిబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి...
వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు..
Read Latest AP News And Telugu News