Share News

Raghurama - Prabhavati: డాక్టర్‌ ప్రభావతిపై రఘురామ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:32 PM

Raghurama Comments On Prabhavati: డాక్టర్ ప్రభావతిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులకు ప్రభావతి సహకరించకపోవడంపై ఫైర్ అయ్యారు.

Raghurama - Prabhavati: డాక్టర్‌ ప్రభావతిపై రఘురామ సంచలన కామెంట్స్
Raghurama Comments On Prabhavati

పశ్చిమగోదావరి, ఏప్రిల్ 9: గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై (Doctor Prabhavati) ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (AP Deputy Speaker Raghurama Krishnam Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి రెండు రోజుల విచారణకు డాక్టర్ ప్రభావతి హాజరయ్యారని.. కానీ ‘నాకేమీ తెలియదు, గుర్తులేదు క్రింద వాళ్లు ఫైల్ తీసుకువస్తే సంతకం పెట్టాను. నేను గైనకాలజిస్ట్ డెలివరీలు మాత్రమే నాకు తెలుసు, గాయాలు అంటే ఏమిటో నాకు తెలియదు’ అని చెప్పటడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌కు కనీస అవగాహన లేకుండా ఉండదన్నారు. ఎవరి ప్రోదల్బంతోనో ఆమె మాట్లాడినట్లుగా స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. డాక్టర్ ప్రభావతి ఎవరి కంటికి కనిపించకుండా, ఎంతో నేర్పరితనంతో రకరకాల ఊర్లు తిరిగి తప్పించుకున్న వైనం అందరికీ తెలుసన్నారు.


మాజీ సీఐడీ పీవీ సునీల్ కుమార్, సునీల్ నాయక్ తనపై దేశద్రోహం కేసు పెట్టినప్పుడు దానికి సాక్షి సంతకం పెట్టింది బోరుగడ్డ అనిల్ అని తెలిపారు. గత నాలుగు నెలలుగా జైలు వెంబడి మార్చి మార్చి తిరుగుతున్నారని.. దీన్నిబట్టి కేసు పెట్టినోడు ఎలాంటోడు, ఆ విట్నెస్ ఎలాంటోడు అర్థం చేసుకుంటే సినిమా మొత్తం అర్థమవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ ప్రభావతి తిరిగి జ్ఞాపకశక్తి రావాలని దేవుడిని కోరుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదంటూ రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు


కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్‌ కేసులో డాక్టర్ ప్రభావతి ఐదవ నిందితురాలుగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ఒంగోలు డీఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు ప్రభావతి. మొదటి రోజు ఉదయం పదిగంటలకు విచారణకు రాగా.. డీఎస్పీ బిజీగా ఉండటంతో మధ్యాహ్నం 1:30 గంటకు రావాల్సిందిగా పోలీసులు తెలిపారు. దీంతో మధ్యాహ్నం1:30 గంటకు ప్రభావతి విచారణకు హాజరవగా.. ఆమెను డీఎస్పీ పలు ప్రశ్నలు వేశారు. అయితే తనకు తెలిదు అనే సమాధానాలు ఇచ్చారు ప్రభావతి. తిరిగి రెండో రోజు కూడా ప్రభావతిని ప్రశ్నించగా.. మొదటిరోజు లాగే తనకు తెలీదు, గుర్తులేదు, అసలు గాయాలు ఎలా ఉంటాయో కూడా తనకు తెలియదు అంటూ సమాధానమిచ్చారు. దీంతో రెండు రోజుల విచారణలో ప్రభావతి ఏమాత్రం సహకరించలేదని.. దీనిపై సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు నిరాశే ఎదురైంది. ప్రభావతి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు ప్రభావతి. విచారణలో భాగంగా ప్రభావతి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 7, 8 తేదీల్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని.. విచారణకు సహకరిస్తామని చెబితేనే మధ్యంతర రక్షణ కల్పిస్తామని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు ప్రభావతి రెండు రోజుల పాటు ఒంగోలు డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో సుప్రీంకు పోలీసులు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..

Karumuri: మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 04:19 PM