Home » Rajahmundry
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై (AP Elections) రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అంతే స్పీడ్‌గా ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మీదే బెట్టింగ్ సాగడం గమనార్హం..
ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని అభిప్రాయ పడ్డారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్రాకు వచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Andhrapradesh: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు.
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పెళ్లి జరుగుతున్న సమయంలో కొందరు మండపంలోకి దూసుకురావడం, పీటలపై ఉన్న పెళ్లికూతురిని కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు సినిమాల్లో చాలానే చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనే అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మండపంలోకి కొందరు దుండగులు దూరి..
Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...
Andhrapradesh: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు గంజాయి చీడ పాకి పోయిందన్నారు. పోలీసులకు ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ నేరస్తులపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి సమాచారం ఇస్తే కానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదని ఎద్దేవా చేశారు.
రాజమండ్రి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్‌కు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు.
రాజమండ్రిలో (Rajahmundry) దారి దోపిడీకి (Robbery) పాల్పడిన నిందితుల్ని పట్టుకోవడం కోసం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ (Special Operation) విజయవంతం అయ్యింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మొత్తం 9 మంది నిందితుల్ని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కోట్ల మూడు లక్షల విలువైన 3.5 కేజీల బంగారు నగల్ని రికవరీ చేశారు.