Home » Road Accident
Telangana: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటి బువ్వ తిని ఎన్నాళైందో నాతల్లీ అంటూ.. కూతురికి నోరారా అన్నం తినిపిస్తున్న అమ్మ ఒకరు... ఇంటికి దూరంగా ఉంటూ చదువు సాగిస్తున్న మనుమరాలిని చూసి ఆమె ముచ్చట్లు వింటున్న అమ్మమ్మ మరొకరు..
రఘునాథపాలెం మండలం హరియాతండా వద్ద మృతిచెందిన ముగ్గురి అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. మే 28న జరిగిన రోడ్డుప్రమాదంపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడని విచారణలో తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
గుంటూరు జిల్లా: మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో ఢీ కొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్న బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
ఒడిశాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రానికే చెందిన మరో 15మందికి గాయాలయ్యాయి.
ఏటూరునాగారం(Eturnagaram) వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
నేపాల్లో కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతయ్యారు.
Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాలీ లారీని అతి వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) గా గుర్తించారు.
ఇవాళ తెల్లవారుజామున అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని పొట్టన బెట్టుకుంది. పొద్దుటే వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో ఏమో కానీ ఓ కారుని ఢీకొట్టాడు.
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్కు చెందిన కొందరు యువకులు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మిగిలింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.