Vijyanagaram : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతి
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:54 AM
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొట్టింది.

20 మందికి గాయాలు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మినీ బస్
గజపతినగరం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బావనపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు. గజపతినగరం ఎస్‌ఐ కె.లక్ష్మణరావు కథనం మేరకు.. విశాఖ జిల్లా తగరపువలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నేత్ర పరీక్షలు చేయించుకొనేందుకు ఒడిశా నుంచి సుమారు 40మంది శుక్రవారం రాత్రి బయలు దేరారు. బస్సు శనివారం వేకువజాము 3 గంటల సమయంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో మల్కన్‌గిరి జిల్లా బావనపల్లి గ్రామానికి చెందిన సుభ్రత్‌రాయ్(30), కుమార్తె మొహిక్‌రాయ్(3) అక్కడికక్కడే మృతిచెందారు. సుభ్రత్‌రాయ్ భార్య మీరారాయ్ సహా 20 మంది గాయపడ్డారు.