Share News

Andhra Pradesh: వెతికి మరీ ప్రభుత్వ సాయం!

ABN , Publish Date - Mar 21 , 2025 | 06:06 AM

ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఏసమ్మ తన గోడు చెప్పుకొంది. తన కుమారుడికి కనీసం దివ్యాం గ పింఛన్‌ మంజూరు చేయాలని కోరింది. దీంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.లక్ష ఆమె బిడ్డ పేరున డిపాజిట్‌ చేయాలని సీఎం అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.

Andhra Pradesh: వెతికి మరీ ప్రభుత్వ సాయం!

ఈ నెల 15న సీఎం చంద్రబాబు తణుకు పర్యటనలో తమ పరిస్థితిపై ఓ మహిళ మొర

భర్తను కోల్పోయానని, కుమారుడు దివ్యాంగుడని ఆవేదన

రూ.లక్ష సాయం అందించాలని సీఎం ఆదేశం

ఫొటో ఆధారంగా మహిళ వివరాలు గుర్తింపు

రూ.లక్ష చెక్కు అందజేసిన అధికారులు

తణుకు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయింది.. కుమారుడు మానసిక వైకల్యంతో సరిగా నడవలేడని, మాట్లాడలేని పరిస్థితి. పింఛను కూడా రావడం లేదు. ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఏసమ్మ తన గోడు చెప్పుకొంది. తన కుమారుడికి కనీసం దివ్యాం గ పింఛన్‌ మంజూరు చేయాలని కోరింది. దీంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.లక్ష ఆమె బిడ్డ పేరున డిపాజిట్‌ చేయాలని సీఎం అక్కడికక్కడే కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. మహిళ నుంచి దరఖాస్తు లేకున్నా, ఏసమ్మ వివరాలు లేకపోయినా సీఎంను కలిసిన ఆమె ఫొటో ఆధారంగా రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. రూ.లక్ష చెక్‌ను గురువారం కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి భీమవరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఏసమ్మ, ఆమె కుమారుడికి అందజేశారు. సీఎం చంద్రబాబు చేసిన సహాయం ఎన్నటికీ మరువలేమని ఏసమ్మ పేర్కొన్నారు. పింఛన్‌ మంజూరుకు, ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆమెకు కలెక్టరు భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 06:06 AM