Share News

YSRCP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:59 AM

గురువారం మండలి నిరవధిక వాయిదా పడిన తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి, ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా మేం సమస్యలను ప్రస్తావిస్తే... ప్రభుత్వం మార్షల్స్‌ను పిలిచి మమ్మల్ని బయటకి పంపించాలని చూసింది.

YSRCP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం

వర్గీకరణ కమిషన్‌ నివేదికపై ప్రకటన మాత్రమే చేశారు: బొత్స

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రయత్నం చేశామని మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ చెప్పారు. గురువారం మండలి నిరవధిక వాయిదా పడిన తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి, ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా మేం సమస్యలను ప్రస్తావిస్తే... ప్రభుత్వం మార్షల్స్‌ను పిలిచి మమ్మల్ని బయటకి పంపించాలని చూసింది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం. అధికారం కోసం కూటమి నేతలు ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’కు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. జనం ఓట్లేశారు... మేం గెలిచాం... దోచుకుందాం... అనే భావనే వారిలో కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనైనా హామీలు నెరవేర్చి, ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కమిషన్‌ రిపోర్ట్‌పై చర్చ పెట్టకుండా, మండలిలో ప్రకటన మాత్రమే చేశారు. గతంలో వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ కేసుల్ని జగన్మోహన్‌రెడ్డి ఎత్తేశారు. జగన్‌ దళిత వర్గాలను గౌరవించారు. పదవుల్లో సమన్యాయం చేశారు’ అని బొత్స అన్నారు. ‘వచ్చే సమావేశాలకైనా జగన్‌ సభకు వస్తారా?’ అని ప్రశ్నించగా... అడిగి చెప్తానని బొత్స బదులిచ్చారు. కాగా పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 05:59 AM