Student Struggles: పుస్తకం పట్టిన చిన్నారి..!
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:56 AM
కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటకు చెందిన సన్నక్కి చిన్నారి పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఎట్టకేలకు పుస్తకం పట్టింది. శుక్రవారం కోసిగిలోని మౌంట్ కార్నెల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కానుంది. తల్లిదండ్రుల వలస కారణంగా సదరు విద్యార్థినికి వచ్చిన కష్టంపై ఈనెల 19న ‘పరీక్ష హాలులో కాదు.. వలస వెళ్లి పొలంలో’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ఇవ్వడం, దానిపై మంత్రి లోకేశ్ స్పందించడం, ఆయన ఆదేశాలతో పరీక్షలు రాసేందుకు అధికారులు బాలికను స్వగ్రామానికి పంపించడం తెలిసిందే.

నేడు కోసిగిలో ఇంగ్లిష్ పరీక్షకు హాజరు
‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు చెప్పిన విద్యార్థిని
కోసిగి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటకు చెందిన సన్నక్కి చిన్నారి పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఎట్టకేలకు పుస్తకం పట్టింది. శుక్రవారం కోసిగిలోని మౌంట్ కార్నెల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కానుంది. తల్లిదండ్రుల వలస కారణంగా సదరు విద్యార్థినికి వచ్చిన కష్టంపై ఈనెల 19న ‘పరీక్ష హాలులో కాదు.. వలస వెళ్లి పొలంలో’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనం ఇవ్వడం, దానిపై మంత్రి లోకేశ్ స్పందించడం, ఆయన ఆదేశాలతో పరీక్షలు రాసేందుకు అధికారులు బాలికను స్వగ్రామానికి పంపించడం తెలిసిందే. ఈ క్రమంలో చిన్నారి గురువారం ఉదయం తన తల్లి కమలమ్మతో కలిసి సొంత గ్రామం చింతకుంటకు చేరుకుంది. బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి ఎంఈవో-2 శోభారాణి, హెచ్‌ఎం నాగేశ్వరి చేతుల మీదుగా హాల్‌టికెట్ అందుకుంది. చిన్నారి మాట్లాడుతూ పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని చెప్పింది. దీనికి కారణమైన ‘ఆంధ్రజ్యోతి’కి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..