Home » Samajwadi Party
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
Lok Sabha Election Results 2024: ఎంతో ఉత్కంఠ రేపిన ఎన్నికల సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) పర్వం ముగిసింది. వార్ వన్ సైడే అనుకున్న వారందరికీ బిగ్ షాక్ ఇచ్చాయి ఎలక్షన్ రిజల్ట్స్. ఈ ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నో రికార్డులకు కేరాఫ్గా మారింది. అలాంటి రికార్డులలో ప్రత్యేకమైన ఒక అంశం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక జిల్లాలో..
లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.
ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.
ఇంటి యజమానిని కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సమాజ్వాదీ పార్టీ నాయకుడు మహమ్మద్ ఆజం ఖాన్కు గురువారం ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్ప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.
దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్పూర్లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని సూచించారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి గెలిస్తే అయోధ్యలో రామమందిరాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు.